- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: మంత్రి పెద్దిరెడ్డి, MP మిథున్ రెడ్డికి తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటి పెను ప్రమాదం తప్పింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లాలో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని ఒకే కారులో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కలిసి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఓ కారు ఎంపీ కాన్వాయ్‌లోని కారును ఢీకొట్టింది. దీంతో మిథున్ రెడ్డి కాన్వాయ్‌లోని కారు పల్టీలు కొట్టింది. ప్రమాదానికి గురైన కారులో ఉన్న ఎంపీ పీఏ, భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వెంటనే రాయచోటిలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రమాదం నుండి మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి తృటిలో తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Next Story






