- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Srisailam:నల్లమల ఘాట్‌రోడ్డులో ప్రమాదం.. కొండను ఢీ కొట్టిన ప్రైవేటు బస్సు
ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలో రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. ఈ రోజు(గురువారం) ఉదయం నల్లమల ఘాట్ రోడ్డులో మలుపు దగ్గర ప్రైవేటు బస్సు కొండను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం(Srisailam) శిఖరానికి 5 కిలోమీటర్ల సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు చిన్నారుట్ల దెయ్యాల మలుపు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్డు లోని చిన్నారుట్ల వద్ద కర్ణాటకకు చెందిన టూరిస్ట్‌ల బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో పక్కనే ఉన్న కొండను ఢీ కొట్టింది.
దీంతో బస్సు డ్రైవర్ కు తీవ్ర గాయాలు కాగా.. బస్సు లోని పది మంది యాత్రికులు గాయపడ్డారు. బస్సు కొండను వేగంగా ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ముందు టైర్లు బస్సు నుంచి విడిపోయాయి. కర్ణాటక నుంచి ప్రముఖ ఆలయాల దర్శనార్ధం కోసం బయలు దేరిన ఈ యాత్రికులు, శ్రీశైలం మల్లన్న స్వామి దర్శనం కోసం వెళుతుండగా వారి బస్సు ప్రమాదానికి గురైంది. గాయపడిన వారిని 108 వాహనాల ద్వారా సుండిపెంట లోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది యాత్రికులు ఉన్నారు. పెను ప్రమాదం జరిగిన ప్రాణాపాయం తప్పడంతో యాత్రికులు ఊపిరి పీల్చుకున్నారు.






