Visakha: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. 15 మందికి అస్వస్థత

by Gantepaka Srikanth |

విశాఖ‌(Visakha)లోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌(Tagore Laboratories)లో విషవాయువులు లీక్ అయ్యాయి.

Visakha: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. 15 మందికి అస్వస్థత
X

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ‌(Visakha)లోని పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ లేబొరేటరీస్‌(Tagore Laboratories)లో విషవాయువులు లీక్ అయ్యాయి. దీంతో అందులో పనిచేసే 15 మంది అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అస్వస్థతకు గురైన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలపై ఆరా తీస్తున్నారు. గతంలోనూ ఈ ఫార్మాసిటీలో పలు ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story