Rajamandri Airport : రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం

by Yella Dhawani Reddy |

నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్ పోర్ట్(Rajamandri Airport) లో భారీ ప్రమాదం(Accident) సంభవించింది.

Rajamandri Airport : రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రాజమండ్రి ఎయిర్ పోర్ట్(Rajamandri Airport) లో భారీ ప్రమాదం(Accident) సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నం విమానాశ్రయంలో నిర్మిస్తున్న కొత్త టర్మినల్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపిన ప్రకారం.. నిర్మాణ పనులు జరుగుతున్న కొత్త టెర్మినల్ లో క్రేన్ వైర్ తెగిపడటంతో నిర్మాణంలో ఉన్న కొంత భాగం కూలిపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరూ లేకపోవడంతో.. పెను ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story