ఏపీ నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు.. సాయంత్రం కీలక ప్రకటన

by Naga Rani Yarlagadda |

రాష్ట్రవ్యాప్తంగా నగరపాలక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.

ఏపీ నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు.. సాయంత్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచీ శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. మరోవైపు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయి. విశాఖలోని మధురవాడ, గాజువాక టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లోనూ, తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోనూ విస్తృతంగా సోదాలు జరుగుతున్నాయి. అనంతపురం, కడప, నెల్లూరు, రాజమండ్రి, నగరపాలక సంస్థల్లోని టౌన్ ప్లానింగ్ చేపట్టిన పములపై ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ సోదాలపై అధికారులు కీలక వివరాలను వెల్లడించనున్నారు. సోదాల్లో ఎలాంటి విషయాలు తెలిశాయో క్లారిటీ ఇస్తామని పేర్కొన్నారు.

Next Story