- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు
అవినీతి అధికారులపై పంజా విసురుతున్న అధికారులు.

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ రాష్ట్రంలో (AP State) అవినీతి అధికారుల నివాసాలపై ఏసీబీ అధికారుల (ACB Officials) దాడులు కొనసాగుతున్నాయి. నిన్న వివిధ జిల్లాలో సోదాలు చేసిన అధికారులు తాజగా ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ (Darsi Municipality) కమిషనర్ మహేశ్వర రావు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదులతో అధికారులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఏసీబీ అధికారులు ఆరు ప్రత్యేక బృందాలుగా విడిపోయి కమిషనర్ నివాసం, కార్యాలయంతో పాటు ఆయన బంధువుల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రధానంగా నరసరావుపేటలోని సాయినగర్ లో ఉన్న మహేశ్వర రావు నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీలు కేవలం నరసరావుపేటకే పరిమితం కాకుండా, దర్శి, గుంటూరు, వినుకొండ, సత్తెనపల్లి వంటి ఐదు ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తుండటం సంచలనం రేపుతోంది. మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న కాలంలో ఆయన భారీగా అక్రమ ఆస్తులు వెనకేశారన్న పక్కా సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంట్లోని విలువైన పత్రాలు, బ్యాంక్ లాకర్లు, బంగారం, ఇతర స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను ఏసీబీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పట్టణ పరిపాలన విభాగంలో కీలక బాధ్యతల్లో ఉన్న అధికారి ఇంటిపై ఈ స్థాయిలో దాడులు జరగడం స్థానికంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సాయంత్రం వరకు ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉందని, పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.






