- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.45 వేలు లంచం.. అడ్డంగా బుక్కైన డీఈవో కార్యాలయం ఏడీ
మదనపల్లె డీఈవో కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు...

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అవినీతి(Bribe)పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నా ఏదో ఒక చోట లంచం తీసుకుంటున్న ఘటన కలకలం రేపుతోంది. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అంటూ ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు కనిపిస్తున్న కొందరు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. యదేచ్ఛగా లంచం తీసుకుంటున్నారు. సైలెంట్‌గా పనులు కానిచ్చేస్తున్నారు. అక్రమాలను స్వయంగా ప్రోత్సహిస్తున్నారు. కొన్ని చోట్ల అవినీతి బాగోతం బయటపడి చర్యలకు కారణమవుతున్నారు. ఇలాంటి ఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లె(Madanapalle)లో తాజాగా వెలుగులోకి వచ్చింది.
పాఠశాల అప్ గ్రేడ్ కోసం...
అన్నమయ్య జిల్లా గుర్రంకొండ(Gurramkonda)లో పాఠశాల అప్ గ్రేడ్ కోసం మదనపల్లె డీఈవో కార్యాలయం ఏడీ రాజశేఖర్(Madanapalle DEO Office AD Rajasekhar)కు దరఖాస్తు చేశారు. అయితే ఆయన లంచం డిమాండ్ చేశారు. దీంతో ఏసీబీ అధికారులను పాఠశాల నిర్వాహకులు సంప్రదించారు. ఈ మేరకు డీఈవో కార్యాలయం ఏడీ రాజశేఖర్‌ను అదుపులో తీసుకున్నారు. రూ. 45 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వం ఆఫీసుల్లో ఎవరూ లంచం తీసుకోవద్దని, ప్రజలకు ఉచితంగా సేవలు అందించాలని ఏసీబీ అధికారులు సూచించారు.






