- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిపై ఉక్కుపాదం.. రాష్ట్రవ్యాప్తంగా ఏసీబీ తనిఖీలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కార్యాలయాలపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు..

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం కార్యాలయాలపై ఏసీబీ అధికారులు(ACB officials) దాడులు చేశారు. మంగళవారం 14 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన అధికారులు.. బుధవారం కూడా కంటిన్యూ చేశారు. ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ కార్యాలయాలు, సిబ్బంది ఇళ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నారు. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది(Ibrahimpatnam Sub Registrar Office Staff) ఇళ్లలోనూ సోదాలు చేశారు. కార్యాలయ సిబ్బంది మహమూద్, దివ్య ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
కాగా రిజిస్టేషన్లలో అక్రమంగా వసూళ్లకు పడుతున్నారంటూ ఆరోపణలు చెలరేగాయి. ఉద్యోగులు, వారి తరపున ప్రైవేటు వ్యక్తులు లంచాలు తీసుకుంటున్నారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందాయి. దీంతో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపించారు. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఆస్తిపత్రాలు, నగదు, బంగారు ఆభరణాలు, మోటారు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.






