రూ. 30 వేలు లంచం.. అడ్డంగా బుక్కైన ఇరిగేషన్ అధికారి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-06-16 10:28:25  IST  )

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ప్రకాశం జిల్లా మార్కాపురం ఇరిగేషన్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ దొరికారు..

రూ. 30 వేలు లంచం.. అడ్డంగా బుక్కైన ఇరిగేషన్ అధికారి
X

దిశ, వెబ్ డెస్క్: రూ. 30 వేలు లంచం అడిగి ఉద్యోగం మీదకు తెచ్చుకున్నారు అధికారి. ఈ ఘటనప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిసెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాసరావును లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్ నుంచి శ్రీనివాసరావు లంచం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏసీబీ అధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గతంలోనూ శ్రీనివాసరావుపై లంచం ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ లంచం బాగోతం వెలుగులోకి వచ్చింది. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమని, ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటూ అధికారులు దొరికితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Next Story