- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అవినీతిపై ఉక్కుపాదం.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు..

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి(Corruption)పై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. బుధవారం నుంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో(Sub-Registrar offices) తనిఖీలు స్టార్ చేశారు. ఈ రోజు సైతం కొనసాగించారు. విశాఖ(Visakha)లోని జగదాంబ, మధురవాడ, పెదగంట్యాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్లు, డేటాను పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ లావాదేవీలపైనా అధికారుల ఆరా తీస్తున్నారు. స్టాంప్ డ్యూటీ చెల్లింపులు తీరుపైనా విచారిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆర్థికలావాదేవీలు జరిగనట్టు గుర్తించారు. సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సిబ్బందికి, ప్రైవేట్ వ్యక్తులతో సంబంధాలపైనా ఆరా తీస్తున్నారు. ఏసీబీ సోదాలతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. సోదాల నేపథ్యంలో రెండోరోజు సైతం డాక్యుమెంట్ రైటర్ల ఆఫీస్‌లు మూతబడ్డాయి.






