Anakapalli: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై

by Vemula.Srinu Prasad |

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఎస్సై అడ్డంగా దొరికిపోయారు...

Anakapalli: లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయిన ఎస్సై
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి(Anakapalli)లో ఏసీబీ అధికారుల(Acb Officers)కు అవినీతి ఎస్సై అడ్డంగా దొరికిపోయారు. సీజ్ చేసిన షాపును తెరిపించేందుకు ఎస్సై ఈశ్వరరావు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు. లంచం ఇచ్చుకోలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఎస్సై ఈశ్వరరావును పథకం ప్రకారం అధికారులు పట్టుకున్నారు. అనంతరం శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు. ప్రభుత్వ సేవలు అందించేందుకు ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఇవ్వొద్దని... తమను సంప్రదించాలని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story