- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : ఏసీబీ కోర్టులో మిథున్ రెడ్డి.. రిమాండ్ పై సస్పెన్స్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించాల్సి ఉంది. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి.. రిమాండ్ పై తీర్పు చెప్పాల్సి ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఏ4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy Arrest)ని నిన్న సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రాత్రంతా సిట్ కార్యాలయంలోనే ఉన్న ఆయన్ను ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. బీపీ, షుగర్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టు (ACB Court)కు తరలించారు. కోర్టులో మిథున్ రెడ్డిని జడ్జి ఎదుట హాజరు పరిచిన సిట్ అధికారులు రిమాండ్ విధించాలని కోరారు. మిథున్ రెడ్డి రిమాండ్ కు అభ్యంతరం లేదంటూనే.. ఆయన ఈసీజీ రిపోర్ట్స్ లో బ్లడ్ క్లాట్స్ ఉన్నట్లు తెలిసిందని, ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మిథున్ తరపు లాయర్లు జడ్జిని కోరారు. సెక్షన్ 409 మిథున్ రెడ్డికి వర్తించదని న్యాయవాదులు వాదించారు. మిథున్ రెడ్డి రిమాండ్ పై వాదనలు ముగియగా.. కోర్టు మిథున్ రెడ్డికి రిమాండ్ (Mithun Reddy Remand) విధించడంపై సందిగ్ధత నెలకొంది.






