- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు.. ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)కి భారీ ఊరట లభించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసు (AP Liquor Scam Case)లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy)కి భారీ ఊరట లభించింది. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని సిట్ దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు విచారించింది. ఎంపీ అరెస్టుకు అనుమతి ఇవ్వాలని కోరింది సిట్. ఎంపీని అరెస్ట్ చేసేందుకు పర్మిషన్ ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పింది. కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసేందుకు నిరాకరించడంతో మిథున్ రెడ్డికి ఊరట లభించినట్లయింది.
కాగా.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు (Supreme Court)ను ఆశ్రయించగా.. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఇటు ఏపీ హైకోర్టు (AP High Court) సైతం ఆయన బెయిల్ పిటిషన్ను రద్దు చేయడంతో ఇక అరెస్టే అనివార్యమనుకున్న తరుణంలో ఏసీబీ కోర్టు (ACB Court) సిట్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో ఎంపీకి భారీ ఊరట లభించింది. ఇప్పటివరకూ ఆయన పరారీలో ఉన్నారని వార్తలు రాగా.. ఇప్పుడైనా దీనిపై స్పందిస్తారేమో చూడాలి.






