- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జైల్లో ప్రత్యేక వసతులపై ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్.. ఏసీబీ కోర్టు ఏం చెప్పిందంటే..
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ (AP Liquor Scam) కేసులో అరెస్టై.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) తనకు జైల్లో ప్రత్యేక వసతులు కావాలని విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతుల కల్పనపై జైలు అధికారులకు కీలక సూచనలు చేసింది. ఆయనకు జైల్లో వెస్ట్రన్ కమోడ్ తో కూడిన సెపరేట్ రూమ్ ఇవ్వాలని ఆదేశించింది. మూడుపూటలా బయటి నుంచి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది. అలాగే 5 రకాల మెడిసిన్ తీసుకునేందుకు కోర్టు ఆమోదం తెలిపింది.
ఎంపీ మిథున్ కు సర్వైకల్ సమస్య ఉన్న కారణంగా బయటి నుంచి స్పెషల్ దిండ్లు తెప్పించుకునేందుకు అనుమతిచ్చింది. దోమ తెర, యోగా మ్యాట్, వాకింగ్ షూస్, మినరల్ బాటిల్స్ కు తెప్పించుకునేందుకు కూడా పర్మిషన్ ఇస్తున్నట్లు జైలు అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొంది. వీటితో పాటు ఇనుపమంచం, పరుపు, కుర్చీ, పెన్ను, పేపర్లు ఇవ్వాలని, రోజువారీ న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్ అందించాలని సూచించింది. ఒక సహాయకుడితో పాటు ఇద్దరు అడ్వకేట్లతో మాట్లాడేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది.






