- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎంపీ మిథున్ రెడ్డికి రిలీఫ్.. స్పెషల్ ఫెసిలిటీస్ కు కోర్టు అనుమతి
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఏ4 ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఏ4 ఎంపీ మిథున్ రెడ్డి (MP Mithun Reddy) ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry Central Jail) రిమాండ్ లో ఉన్న విషయం తెలిసిందే. అయితే జైల్లో తనకు స్పెషల్ ఫెసిలిటీస్ కావాలని ఏసీబీ కోర్టు (ACB Court)లో పిటిషన్ వేయగా.. దానిపై విచారణ చేసిన కోర్టు నేడు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని రాజమండ్రి జైలు అధికారులకు జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది.
మిథున్ రెడ్డి కోరిన విధంగా మంచం, దిండు, దుప్పటి, కిన్లే వాటర్ బాటిల్స్, కూలర్, వైట్ పేపర్స్ విత్ పెన్, టేబుల్, ప్రొవిజన్ ఉంటే టీవీ అనుమతించాలని తెలిపింది. ఇంటి నుంచి భోజనం తీసుకువస్తే అండర్ టేకింగ్ లెటర్ ఇవ్వాలని ఆదేశించింది. ప్రస్తుతం జైల్లో ఉన్న వైద్య సౌకర్యం కల్పించాలని, అవసరమైతే జైలు బయట వైద్యసౌకర్యం కల్పించాలని సూచించింది. అలాగే న్యాయవాదులకు వారంలో మూడుసార్లు, బంధువులకు వారంలో రెండుసార్లు ములాఖత్ లకు కోర్టు అనుమతినిచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి స్వల్ప ఊరట లభించినట్లైంది.






