- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లిక్కర్ కేసు నిందితులకు బిగ్ షాక్.. ఆస్తుల అటాచ్‌కు గ్రీన్ సిగ్నల్
లిక్కర్ కేసు నిందితుల ఆస్తుల అటాచ్‌కు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ లిక్కర్ స్కాం(Ap Liquor Case) కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada Acb Court) అనుమతించింది. నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్‌కు సంబంధించిన గతంలోనే కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ సమయంలో సిట్ పిటిషన్‌ను కోర్టు రిటర్న్ చేసింది. దీంతో తాజాగా మరోసారి సైతం సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ధర్మాసనం విచారణ జరిపింది. నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా జీవో నెం.111, 126ను విడుదల చేసింది.
కాగా గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన కేసులో మొత్తం 16 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి సహా పలువురు నిందితులు పస్తుతం రిమాండ్ లో ఉన్నారు. వీరంతా ప్రస్తుతం బెయిల్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుల ఆస్తుల అటాచ్ మెంట్ చేయాలంటూ దాఖలు చేసిన సిట్ పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెల్లడించింది.






