ఏసీబీ రైడ్స్.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్ఐ

by Vemula.Srinu Prasad |

కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ అనిల్ కుమార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు...

ఏసీబీ రైడ్స్.. రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్ఐ
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌(Simhadripuram Police Station)లో ఏసీబీ సోదాలు(ACB Searches) నిర్వహించారు. ఓ కేసు విషయంలో ఎస్ఐ అనిల్ కుమార్(SI Anil Kumar) రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో అధికారులను బాధితుడు ఆశ్రయించారు. పక్కా పథకం ప్రకారం ఎస్ఐ అనిల్ కుమార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పులివెందుల రూరల్ సీఐ రమణను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తు్న్నారు. లంచం చట్టరిత్యా నేరమని, అధికారులు డిమాండ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం అడిగితే తమను సంప్రదించాలని సూచించారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.

Next Story