- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నష్టపరిహారం చెల్లించండి: 11 మంది ఐపీఎస్‌లు, సీపీఆర్వోకు ఏబీవీ నోటీసులు
జగన్ ప్రభుత్వంలో పని చేసిన 11 మంది ఐపీఎస్‌లు, ఓ సీపీఆర్వోపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు....

దిశ, వెబ్ డెస్క్: జగన్ ప్రభుత్వంలో పని చేసిన 11 మంది ఐపీఎస్‌లు, ఓ సీపీఆర్వోపై రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సీరియస్ అయ్యారు. తన పరువుకు భంగం కల్గించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేశారు. రూ. కోటి నష్ట పరిహారం చెల్లించాలంటూ మొత్తం 11 మందికి వెంకటేశ్వరావు నోటీసులు పంపారు.
తీవ్ర వివక్షకు ఏబీవీ
కాగా జగన్ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర వివక్షకు గురయ్యారు. ఆయన పట్ల వ్యతరేకంగా పని చేసింది. వివిధ కారణాలతో ఏబీవీని సస్పెండ్ చేయడంతో పాటు ఆయన రిటైర్డ్ అయ్యే ఒక్క రోజు ముందు వరకూ వేధింపులకు గురి చేసింది. అయితే అన్ని తట్టుకుని ధైర్యంగా నిలబడ్డారు. న్యాయపోరాటం చేసి తన పదవిని దక్కించుకున్నారు. కానీ పదవిని చేపట్టిన రోజునే విరమణ చేయాల్సి వచ్చింది. అలా జగన్ ప్రభుత్వంలో అధికారులు సైతం ఆయనను చులకన చేసి మాట్లాడారు. ప్రభుత్వం మారడంతో ఆయనకు కొందరు అధికారులు క్షమాపణలు చెప్పారు. కానీ మరికొందరు చెప్పలేదు. దీంతో తనను వేధించిన, అవమానించిన వారికి బుద్ది చెప్పేందుకు ఏబీవీ తాజాగా సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే 11 మంది ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. తన పరువుకు భంగం కలిగించారంటూ నష్టపరి చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.






