- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత తొలి విద్యా శాఖ మంత్రి అబుల్ కలామ్ ఆజాద్
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (Maulana Abul Kalam Azad) జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆయనకు నివాళి అర్పించారు.

దిశ, వెబ్ డెస్క్ : మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (Maulana Abul Kalam Azad) జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) ఆయనకు నివాళి అర్పించారు. సంస్కరణలతో దేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేశారన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడిన యోధుడని కొనియాడారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా (Education Minister) మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ పని చేశారని గుర్తు చేశారు. విద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ప్రజలందరికీ జాతీయ విద్యా దినోత్సవ, మైనారిటీ సంక్షేమ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు.
మంత్రి నారా లోకేష్ నివాళులు
స్వాతంత్య్ర సమరయోధులు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా మంత్రి నారా లోకేష్ నివాళులు అర్పించారు. అబుల్ కలాం ఆజాద్ వినూత్న సంస్కరణల ద్వారా దేశంలో విద్యాభివృద్ధికి విశేషంగా కృషిచేశారని మంత్రి అన్నారు. విద్యారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జరుపుకుంటున్న మైనార్టీ సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.
కళాక్షేత్రంలో వేడుకలు
భారతరత్న, స్వాతంత్ర సమరయోధులు దేశ తొలి విద్య శాఖ మంత్రి మౌలాన అబుల్ కలాం అజాద్ జన్మదినం పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా (Minority Welfare Day) నిర్వహిస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైన మతగురువులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. విజయవాడ నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు జరగనున్న వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.






