- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోషల్ మీడియా పోస్టులకు ఆధార్ అకౌంటుబులిటీ.. ఏపీ సర్కారు కీలక నిర్ణయం!
క్యాబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపైన చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : క్యాబినెట్ భేటీ అనంతరం రాజకీయ అంశాలపైన చర్చ జరిగింది. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు పోస్టుల నివారణకు సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై విధి విధానాలు చర్చించారు. మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. మంత్రులు అనిత, మనోహర్, అనగాని, పార్థసారధితో ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘం కొత్త చట్టం తీసుకువచ్చేందుకు నిబంధనల రూపకల్పన చేయనుంది. తప్పుడు పోస్టులు పెట్టే వారిపై కఠినచర్యలు ఉండేలా చట్టం ఉండాలని సీఎం సూచించారు. భావప్రకటన స్వేచ్ఛ శ్రుతిమించకూడదని ఆయన అన్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించిన విషయాన్ని సీ ఎం ప్రస్తావించారు. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని చంద్రబాబు తెలిపారు. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా ఉన్నందుకు తనను టార్గెట్ చేస్తున్నారు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అ న్నారు. స్వార్థ రాజకీయాల కోసం చేసే విష ప్రచారాన్ని ధీటుగా తిప్పికొడదాం అన్నారు.
యూరియాపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రులతో సీఎం చర్చించారు. ఎరువుల ఇబ్బంది లేకుండా వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు అన్నారు. సరైన సమయంలో వైసీపీ నేతల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టలేదని సీఎం అభి ప్రాయపడ్డారు. ఇకనుంచి ఇలాంటి ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సోషల్ మీడియా పోస్టులకు ఆధార అకౌంటుబులిటీ ఉండేలా చట్టం ఉండాలనే అంశంపై చర్చించారు. డీఎస్సీ సమర్ధంగా నిర్వహించారంటూ మంత్రివర్గంలో మంత్రులు లోకేష్కు అభినందనలు తెలిపారు. డీఎస్సీని నిర్వహించేందుకు 72 కేసులు వేసినా దీటుగా ఎదుర్కొన్నారని ప్రశంసించారు. సుమారు 400 మంది పోలీసులు డీఎస్సీకి ఎంపికయ్యారని మంత్రులు తెలిపారు. ఖాళీ అయిన పోలీసుల పోస్టులు త్వరగా భర్తీ చేయాలని అంశంపై చర్చించారు. లీగల్ సమస్యలు పరిష్కరించుకొని ఖాళీల భర్తీ చేయాలని లోకేష్ అన్నారు.






