- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో పెను సంచలనం.. తప్పు ఒప్పుకున్న నిందితుడు
తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో లంచం తీసుకున్నానని ఏ3 నిందితుడు విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నారు...

X
దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసు(Tirumala laddu ghee adulteration case)లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఈ కేసు ఏ3 నిందితుడు విజయభాస్కర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు అంగీకరించారు. నెయ్యిని కంపెనీలు కల్తీ చేశాయని, ఇందుకు అనుకూలంగా తాను వ్యవహరించానని, ఈ మేరకు లంచం తీసుకున్నానని డెయిరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి(Dairy expert Vijayabhaskar Reddy) ఒప్పుకున్నారు. నిందితుడు నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో ఈ విషయాన్ని వెలిబుచ్చారు. దీంతో నిందితుడికి బెయిల్ ఇవ్వొద్దని అసిస్టెంట్ పీపీ వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన నెల్లూరు ఏసీబీ కోర్టు.. విజయ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్‌ను చేసింది.
Next Story






