- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎన్టీఆర్ జిల్లా యువతి మృతి
by Ramesh Naini |
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా యువతి అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఎన్టీఆర్ జిల్లా యువతి అట్లూరి ప్రసన్న న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. స్నేహితులతో కలిసి కారులో సమీపంలోని ఆలయానికి వెళ్తుండగా, సిగ్నల్ వద్ద ఆగి ఉన్న వారి కారును మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసన్నతో పాటు మరో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలిసింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న ఇటీవలే పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story






