- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
గుంటూరులో దారుణం.. వీధి కుక్కను కత్తితో పొడిచి చంపిన యువకుడు
దిశ, వెబ్ డెస్క్: జంతువుల పట్ల కొందరు విచక్షణ కోల్పోతున్నారు. పిడికెడు అన్నం తిని ఇంటిని, గ్రామాన్ని కాపాలా కాసే కుక్కలపై అతి దారుణం ప్రవవర్తిస్తున్నారు. మనుషుల పట్ల విశ్వాసం చూపించే కుక్కల పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారు. దాడులు చేస్తున్నారు. లేదంటే చంపేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటిలోకి వచ్చిందన్న కోపంతో కుక్కతో పాటు యజమానిపై ఘోరంగా దాడి చేశారు. ఈ ఘటన మర్చిపోకముందే ఈ సారి ఓ యువకుడు వీధి కుక్కను అతి దారుణంగా కత్తితో దాడి చేసి చంపేశారు. ఈ ఘటన గుంటూరులో జరిగింది. తమ షాపు ముందు పడుకుంటుందని వీధి కుక్కపై యువకుడు కత్తితో దాడి చేశారు. విచక్షణ రహితంగా నరికి చంపేశారు. దీంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటన స్థలాన్ని చేరుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు గోపీకృష్ణగా గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశ్వాసం చూపించే కుక్క పట్ల కసాయిగా ప్రవర్తించిన యువకుడు గోపీకృష్ణను కఠినంగా శిక్షించాలని యానిమల్ ప్రియులు డిమాండ్ చేస్తున్నారు.
Read More..