నడిరోడ్డుపై కత్తి పట్టుకొని సైకో వీరంగం

by Muthe.Rajitha |   (  Updated:2025-12-14 13:53:05  IST  )

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడు కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు.

నడిరోడ్డుపై కత్తి పట్టుకొని సైకో వీరంగం
X

దిశ, వెబ్ డెస్క్ : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడు కత్తి పట్టుకొని వీరంగం సృష్టించాడు. స్థానికులు భయభ్రాంతులకు గురై పోలీసులకు సమాచారం అందించగా.. యువకుణ్ణి అరెస్ట్ చేసారు. అనంతపురం జిల్లా పామిడి బస్టాండ్‌ ప్రాంతంలో రవి అనే యువకుడు కత్తి పట్టుకుని హల్ చల్ చేసాడు. స్థానికులను కత్తితో బెదిరించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకుడిని అదుపులోకి తీసుకునేందుకు వచ్చిన పోలీసులపైనా రవి దాడికి యత్నించాడు. అతడి భార్య అడ్డుకునే ప్రయత్నం చేసినా వినకుండా వీరంగం సృష్టించాడు.

పోలీసు వాహనాన్ని కూడా ధ్వంసం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భద్రతా కారణాల వల్ల పోలీసులు కొద్దిసేపు వెనక్కి వెళ్లాయి. అనంతరం అదనపు బలగాలతో వచ్చి రవిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. అతడికి మానసిక సమస్యలు ఉన్నాయని, కొద్దిరోజులుగా చికిత్స తీసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Next Story