- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుట్టినరోజే విషాదాంతం..!
అమెరికాలో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువకుడు సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. ..

దిశ, వెబ్ డెస్క్: అమెరికా(America)లో విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువకుడు సింగిరెడ్డి సాయి శ్రీహరికృష్ణ మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అనుకున్నట్టుగానే మూడు నెలల క్రితం సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించిన హరికృష్ణ.. తన భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే పుట్టినరోజు నాడే విధి ఆయన్ను బలి తీసుకుంది. పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి ఘనంగా జరుపుకుని సరదాగా స్నానం చేసేందుకు జలపాతం వద్దకు వెళ్లారు. కొద్దిసేపటికి నీళ్లలోకి దిగారు. అయితే హరికృష్ణకు ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు
చేతికందిన కొడుకు ప్రయోజకుడై తిరిగి వస్తాడని ఆశించిన తల్లిదండ్రులకు పుట్టినరోజు నాడే బిడ్డ మరణవార్త తెలియడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. హరికృష్ణ మరణ వార్త పిరిడి గ్రామంలో తెలియడంతో విషాద ఛాయలు అలముకున్నాయి. ఎంతో యాక్టివ్‌గా హరికృష్ణ ఇక లేడని తెలిసి అటు స్థానికులు సైతం కన్నీరుమున్నీరయ్యారు. ప్రస్తుతం హరికృష్ణ భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. త్వరగా తమ కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.






