అరుణాచలంలో ఏపీ యువకుడు అనుమానాస్పద మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

by Vemula.Srinu Prasad |

అనకాపల్లి జిల్లా యువకుడు అనుమానాస్పద మృతి చెందారు..

అరుణాచలంలో ఏపీ యువకుడు అనుమానాస్పద మృతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?
X

దిశ, వెబ్ డెస్క్: అనకాపల్లి జిల్లా(Anakapalli District) యువకుడు అనుమానాస్పద మృతి చెందారు. వెంకటాపురానికి చెందిన యువతిని ప్రేమించిన నవీన్... అరుణాచలంలో తీవ్ర గాయాలతో మృతి చెందారు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని నవీన్ కుటుంబ సభ్యులు అంటున్నారు. ప్రేమించిన పాపానానికి తల్లికూతురు ఇద్దరే నవీన్‌ను చంపి కేసును తప్పు దోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

‘‘10వ తరగతి స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లాడు. రాత్రి ఫోన్ చేశాడు. అన్నం తిన్నావా అని అడిగాడు. రేపు ఉదయం చెన్నై వస్తానని చెప్పాడు. అయితే అర్ధరాత్రి సమయంలో మాకు ఫోన్ వచ్చింది. మేడపై నుంచి పడిపోయాడు అని చెప్పారు. అయితే స్నేహితులతో కలిసి వెళ్లాడని చెప్పాడని మాకు చెప్పారని, కానీ ఓ అమ్మాయితో కలిసి అరుణాచలం వెళ్లాడని ట్రైన్ టికెట్ల ద్వారా అర్ధమైంది. రూప అనే అమ్మాయిని నవీన్ ప్రేమించాడట. మాకు చెప్పి ఉంటే మందలించేవాళ్లం. మా అబ్బాయి మృతికి యువతి రూప, ఆమె తల్లి చిన్నినే కారణం. నిందితులను కఠినంగా శిక్షించాలి.’’అని నవీన్ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story