- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pawan Kalyan: ఐదేళ్ల అరాచక పాలన ముగిసి ఏడాది.. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్
కూటమికి విజయం దక్కిన రోజును ఉప ముఖ్యమత్రి పవన్‌కల్యాణ్ గుర్తు చేసుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో : కూటమికి విజయం దక్కిన రోజును ఉప ముఖ్యమత్రి పవన్కల్యాణ్గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏడాది గడిచిందని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎన్టీఏ (NDA) కూటమి చారిత్రక విజయానికి ఏడాది... జనసేన పార్టీ వందశాతం స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది... అని ఆయన పేర్కొన్నారు. ‘ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజు, ఐదేళ్ల అరాచక పాలనను తరిమికొట్టి, నిరంకుశ ఫ్యూడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బ ద్దలుకొట్టి, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు.. నరేంద్రమోదీ దృఢమైన నాయకత్వం, నాలుగున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం, ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ప్రజాక్షేత్రంలో దృఢంగా నిలచిన చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలో, దశాబ్ద కాలంగా ఎన్నో పోరాటాలు చేసి, మరెన్నో దాష్టికాలను తట్టుకుని అడ్డుగోడగా నిలచిన జనసైనికులు, వీరమహిళల పోరాట స్పూర్తి, వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే జనసేన సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందించిన రోజు..’ అని ఆయన పేర్కొన్నారు.
‘మీరు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నాం, గత తప్పిదాలను సరిచేస్తూ, భావి తరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా, రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర 2047 దిశగా నడిపించేందుకు, వికసిత్ భారత్ 2047 లో కీలక భాగస్వామిగా అయ్యేందుకు ఉమ్మడి ప్రణాళికతో, రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రజల ఆకాంక్షలే లక్ష్యంగా జనసేన పార్టీ - తెలుగుదేశం - బీజేపీ పార్టీల ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రజా పరిపాలనను అందిస్తుంది. రానున్న రోజుల్లో మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని, సంక్షేమాభివృద్ధి సాధించేలా మరింత బాధ్యతతో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను..’ అని ఆయన పేర్కొన్నారు.






