- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
by Thanuru Gopichand |
ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది.

X
దిశ, డైనమిక్ సూళ్లూరుపేట: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న మహిళ మృతి చెందింది. ఈ ఘటన నాయుడుపేట- పూతలపట్టు జాతీయ రహదారి రింగ్ రోడ్డుపై బుధవారం తెల్లవారుజామున జరిగింది. వివరాల మేరకు నాయుడుపేట పట్టణం, రాజగోపాలపురంకు చెందిన ఓ కుటుంబం తిరుపతికి వెళ్లి తిరిగి వస్తున్నారు. కొద్ది గంటల్లో ఇంటికి చేరుకుంటారనుకునే లోగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సొల్లేటి ప్రవీణ అనే మహిళ ప్రాణాలు పోగొట్టుకుంది. కారులో ప్రయాణిస్తున్న పలువురికి గురయ్యారు. వీరిని దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలంలోని మృతదేహాన్ని పోలీసులు నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






