Nara Lokesh : పుట్టపర్తి లో నారా లోకేష్ కు ఘన స్వాగతం..

by Jakkula.Mamatha |   (  Updated:2024-03-06 16:44:23  IST  )

పుట్టపర్తి విమానాశ్రయం లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది.

Nara Lokesh : పుట్టపర్తి లో నారా లోకేష్ కు ఘన స్వాగతం..
X

దిశ, పుట్టపర్తి : పుట్టపర్తి విమానాశ్రయం లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలతో విమానాశ్రయం కిక్కిరిసిపోయింది.శ్రీ సత్య సాయి జిల్లా పర్యటనలో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీమంత్రులు పరిటాల సునీత, రఘునాథరెడ్డి తో పాటు పార్టీ నాయకులు పరిటాల శ్రీరామ్ , కందికుంట వెంకట ప్రసాద్, సునీల్ కుమార్, జీ వీ ఆర్ నాయుడు, రామకోటి ఆదినారాయణ పుష్పగుచ్చములు అందించారు. నారా లోకేష్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. నారా లోకేష్ తో ఫోటోలు దిగడానికి ఎగబడ్డారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన కార్యకర్తలతో విమానాశ్రయం కిటకిటలాడింది. అనంతరం ప్రత్యేక కాన్వాయ్ లో రోడ్డు మార్గంలో ఆయన హిందూపురం వెళ్లారు.

Read More..

ఆ రెండు స్థానాల్లో ఎక్కడైనా ఓకే.. మాజీ మంత్రి గుమ్మనూరు

Next Story