బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు.. దద్దరిల్లిన శాసనమండలి

by Vemula.Srinu Prasad |

శాసనమండలిలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది....

బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడు.. దద్దరిల్లిన శాసనమండలి
X

దిశ, వెబ్ డెస్క్: శాసనమండలి(Legislative Council)లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రోడ్లు, విద్యుత్‌పై అధికార పక్షాన్ని ప్రతిపక్షం నిలదీసింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై ప్రతిపక్ష సభ్యుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇందుకు మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) స్పందించి బదులిచ్చారు. దీంతో ఇద్దరి మధ్య వాడీ వాడీగా చర్చ జరిగింది. పరస్పరం ప్రశ్నలు సంధించుకున్నారు. బడ్జెట్‌పై ఎమ్మెల్సీ బొత్స విమర్శలు కురిపించారు. హామీలు నెరవేర్చేందుకు అరకొరగా నిధులు కేటాయించారని బొత్స వ్యాఖ్యానించారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లుగా మారుస్తామన్నారని, శ్రీకాకుళంలో రోడ్లు బాగులేవని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా అని బొత్స సవాల్ విసిరారు. ఏ జిల్లాలో ఏ రోడ్డు వెళ్దామో తమరే సెలక్ట్ చేయండని బొత్సకు అచ్చెన్న కౌంటర్ ఇచ్చారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు గత ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని అచ్చెన్న నిలదీశారు.

Next Story