తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. అన్యమత గుర్తులతో వాహనం కలకలం

by Vemula.Srinu Prasad |

అన్యమత గుర్తులతో ఉన్న వాహనం తిరుమలలో కలకలం రేపింది..

తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం.. అన్యమత గుర్తులతో వాహనం కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. అన్యమత గుర్తుల(Pagan symbols)తో ఉన్న వాహనం తిరుమల ఘాట్ రోడ్డు(Tirumala Ghat Road) నుంచి కొండపైకి వెళ్లింది. అన్యమత గుర్తులు, కొన్ని వ్యాఖ్యలతో ఉన్న తమిళనాడుకు చెందిన టెంపో వాహనం(Tempo vehicle) తిరుమల కొండపై పార్క్ చేశారు. ఈ ప్రాంతంలో ఆలయానికి చెందిన భద్రతా సిబ్బంది తిరుగుతున్నప్పటికీ పట్టించుకోలేదు. భక్తులు గుర్తించి ఆందోళనకు దిగారు. దీంతో వాహనంపై ఉన్న గుర్తులను తొలగించి తిరుమల నుంచి పంపేశారు.

అయితే తిరుమల కొండపైకి వచ్చే ప్రతి వాహనాన్ని అలిపిరి చెకింగ్ కేంద్రం వద్ద పరిశీలిస్తారని, కానీ అన్యమత గుర్తులతో ఉన్న టెంపో వాహనాన్ని పైకి ఎలా పంపారని భక్తులు ప్రశ్నించారు. తనిఖీలు చేయడంతో ఇంత నిర్లక్ష్యం పనికిరాదని, గతంలో చాలా సార్లు ఇలాంటి ఘటన జరిగినప్పటికీ అలర్ట్‌గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అలిపిరి వద్ద వాహనాలను తనిఖీలు చేసి పైకి పంపాలని, మరోసారి పునరావృతం కాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story