రాష్ట్రంలో రెండు చోట్ల విషాదం.. వర్షం, పిడుగుపాటుకు ఇద్దరు మృతి

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా తుళ్లూరులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు శ్రీనివాసరావు వ్యక్తి మృతి చెందారు. తుళ్లూరు ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది..

రాష్ట్రంలో రెండు చోట్ల విషాదం.. వర్షం, పిడుగుపాటుకు ఇద్దరు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా తుళ్లూరులో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు శ్రీనివాసరావు వ్యక్తి మృతి చెందారు. తుళ్లూరు ఈ సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో మేరీమాత స్కూల్‌ మైదానంలో హఠాత్తుగా పిడుగుపడింది. అదే సమయంలో శ్రీనివాసరావు అక్కడే ఉన్నారు. ఈ ప్రమాదంతో శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందారు. మృతుడు బీఎస్‌ఆర్‌ కంపెనీలో సర్వేయర్‌ విభాగ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ప్రాతకోట గ్రామంలో వర్షం కురిసింది. దీంతో గోడ కూలి ఏడాది బాలుడు మృతి చెందాడు

Next Story