విషాదం.. చీర కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య

by Vemula.Srinu Prasad |

సత్యసాయి జిల్లా ధర్మవరం బాలాజీ నగర్‌లో విషాదం చోటు చేసుకుంది...

విషాదం.. చీర కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: సత్యసాయి జిల్లా(Satyasai District) ధర్మవరం(Dharmavaram) బాలాజీ నగర్‌లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. ప్రెషర్స్ డే పార్టీ(Pressures Day Party)కి తల్లిదండ్రులు చీర కొనివ్వలేదని విద్యార్థిని ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ధర్మవరం ఉమెన్స్ కాలేజీ(Womens College)లో ఉష ఇంటర్ చదువుతున్నారు. అయితే కాలేజీలో ప్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరలో వెళ్లాలని ఉష భావించారు. ఈ మేరకు తనకు చీర కొనివ్వాలని తల్లిదండ్రులను కోరారు. అయితే వాళ్లు నిరాకరించడంతో మనస్థాపం చెందిన ఉష బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉష మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story