- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. వాగులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
పార్వతీపురం మన్యం జిల్లా పులిగుమ్మిలో విషాదం చోటు చేసుకుంది..

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvatipuram Manyam District) పులిగుమ్మిలో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. వాగు(Brook)లో ఈత(Swimming)కు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఈశ్వరరావు, నాగిరెడ్డి సాయిగా గుర్తించారు. పెళ్లి వేడుకలో భాగంగా పులిగుమ్మికి వెళ్లిన ఈశ్వరరావు, నాగిరెడ్డి.. ఇద్దరూ మంచి స్నేహితులు. ఇంటర్ చదువుతున్నారు. స్థానిక వాగు వద్దకు వెళ్లారు. ఈతకు దిగారు. కొద్దసేపు వాగులో జలకాలాడారు. అయితే ఒక్కసారిగా ఈశ్వరరావు వాగులో కొట్టుకుపోవడాన్ని నాగిరెడ్డి గమనించారు. ఈ మేరకు కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరూ నీటిలో ముగిపోయారు. ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఇద్దరు విద్యార్థుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఎంతో ఉత్సాహంగా కనిపించే ఇద్దరు విద్యార్థులు ఇక లేరని తెలిసి స్నేహితులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






