పాడేరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-04-12 14:51:22  IST  )

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో విషాదం చోటుచేసుకుంది. పెదకోడపల్లి నుంచి కించూరు గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోకి దూసుకెళ్లింది.

పాడేరులో ఘోర ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) పాడేరు ఏజెన్సీ(Paderu Agency)లో విషాదం(Tragedy) చోటుచేసుకుంది. బండ్రోతుపుట్టు ఘాట్ రోడ్డు(Bandrothuputtu Ghat Road)పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిలో ముగ్గురిని మృత్యువు కబళించింది. పెదకోడపల్లి నుంచి కించూరు గ్రామానికి బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లితో పాటు ఇద్దరు పసిపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు తక్షణమే స్పందించి బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతులంతా కించూరు పంచాయతీకి చెందిన వారిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story