- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ap: లాడ్జిలో లవర్స్ సూసైడ్
by Vemula.Srinu Prasad |
తిరుపతి జిల్లా నాయుడుపేటలో విషాదం చోటు చేసుకుంది..

X
దిశ, వెడ్ డెస్క్: ఇద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి ఉండాలనుకున్నారు. తల్లిదండ్రులను కాదని ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. సీన్ కట్ చేస్తే లాడ్జ్‌లో ఉరేసుకుని చనిపోయారు. ఈ ఘటన తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగింది. ఓ బస చేసేందుకు యువతీ, యువకుడు నాయుడుపేటలోని లాడ్జ్‌లో ఓ రూమ్‌ను తీసుకున్నారు. రెండు రోజులు గడిచాయి. గది తలుపులు మూసే ఉన్నాయి. అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది తలుపులు తీశారు. దీంతో గదిలో ప్రేమికులిద్దరూ ఉరేసుకుని మృతి చెందారు. దీంతో పోలీసులకు వెంటనే సమాచారం అందజేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను కిందకు దించి పోస్టుమార్టంకు తరలించారు. వాళ్ల ఆధార్ కార్డుల ప్రకారం బంధువులకు సమాచారం అందజేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






