ఏళ్ళు గడిచినా దొరకని జాడ.. చివరికి ఇలా.!

by Geesa Chandu |

అది కుంచనపల్లి అండర్ పాస్.. దానికి దగ్గర్లోనే ఒక వ్యక్తి అత్యంత దీనావస్థలో కనిపించాడు. అతడు వానకి తడుస్తూ.. ఎండకి ఎండుతూ అక్కడే నివాసం ఉంటున్నాడు.

ఏళ్ళు గడిచినా దొరకని జాడ.. చివరికి ఇలా.!
X

దిశ, వెబ్ డెస్క్: అది కుంచనపల్లి అండర్ పాస్.. దానికి దగ్గర్లోనే ఒక వ్యక్తి అత్యంత దీనావస్థలో కనిపించాడు. అతడు వానకి తడుస్తూ.. ఎండకి ఎండుతూ అక్కడే నివాసం ఉంటున్నాడు. అక్కడే చిరు వ్యాపారం చేస్తున్నవారికి అతను మానసికంగా ఇబ్బంది పడుతూ కనిపించడంతో.. ఆ వ్యాపారులు తమకి తోచింది ఇస్తున్నారు.

అయితే రోజూ అదే దారి గుండా వెళ్లే.. ఆరోగ్య శాఖా మలేరియా సబ్ యూనిట్ వైద్యాధికారి శ్రీనివాస్ కూడా మొదట్లో ఆ మానసిక ఇబ్బంది పడుతున్న వ్యక్తికి తోచింది సహాయం చేసేవాడు. తర్వాత కొద్దిరోజులకు శ్రీనివాస్ కి అనుమానం కలిగి ఆ రోగి వివరాలను వాకబు చేయగా.. అతను అస్సాం రాష్ట్రానికి చెందిన సజ్జన్ బిలాల్ గా గుర్తించి, వారి కుటుంబ వివరాలు సేకరించి చివరిగా వారి ఇంటికి చేర్చాడు. అయితే రోగి వివరాలు కనుకునేందుకు ఆ వైద్యాధికారి శ్రీనివాస్ అలుపెరుగకుండా 10 రోజులు తీవ్రంగా శ్రమించి.. కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, చివరికి ఆ మానసిక రోగిని తిరిగి కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కథ సుఖాంతం అయ్యింది.అయితే నెలరోజుల క్రితం అస్సాం కు చెందిన సజ్జన్ బిలాల్, తమ సోదరులతో కలిసి పని నిమిత్తం రైలు లో బెంగళూరు వెళ్తూ.. మంచి నీళ్ళ కోసమని విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగాడు, అతను తిరిగి వెళ్లేసరికి అప్పటికే రైలు వెళ్లిపోయింది. తర్వాత తన వారిని సంప్రదించేందుకు ఎంత ప్రయత్నించినా వారిని చేరుకోలేకపోయాడు. దాంతో ఆక్కడే అటు ఇటు కొద్దీ రోజులుగా తిరుగుతూ కుంచనపల్లి అండర్ పాస్ వద్దకు వచ్చాడు. అక్కడే మానసికంగా కుంగిపోయి దీన స్థితిలో ఉన్న సజ్జన్ బిలాల్ ను శ్రీనివాస్ చూడడటంతో చివరికి ఇలా సొంత గూటికి చేరుకున్నాడు. ఈ గొప్ప పని చేసిన శ్రీనివాస్ ను చుట్టు పక్కల వారంతా అభినందించారు.

Next Story