రెండు గేదెలను చంపిన పులి.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ ప్రజలు

by Vemula.Srinu Prasad |

ఏలూరు జిల్లా పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది..

రెండు గేదెలను చంపిన పులి.. భయాందోళనలో పోలవరం ఏజెన్సీ ప్రజలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏలూరు జిల్లా(Elugu District) పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో పులి సంచరిస్తోంది. ఇటకలకోటలో ఈ రోజు రెండు గేదెలపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రాత్రి సమయంలో జనావాసాల్లోకి వచ్చి దాడి చేసిందని తెలిపారు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయమేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పులిపాదముద్రలు సేకరించారు. పులి ఏ వైపు వెళ్లిందనేది పరిశీలిస్తున్నారు. పులి కోసం గాలిస్తున్నారు. పులిని బందించే వరకూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలాలకు వెళ్లే రైతులు చేతిలో రక్షణగా కర్రలు తప్పనిసరిగా తీసుకెళ్లాలని తెలిపారు. కాగా కొంతకాలంగా చుట్టు ప్రాంతాల్లోనే పులి సంచరిస్తోంది. కనిపించిన పశువులపై దాడి చేస్తోంది. అది ఈ పులినేనా.. మరో పులి సంచరిస్తుందా అనే కోణంలో అటవీ శాఖ అధికారులు స్థానిక ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు.

Next Story