- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాండవుల మెట్టపై పెద్దపులి.. ఫారెస్ట్ అధికారుల కీలక ప్రకటన
తూర్పుగోదావరి జిల్లాలో మళ్ళీ పెద్దపులి కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా కనుమరుగైన బెంగాల్ టైగర్ తాజాగా కోరుకొండ పరిసరాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది..

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లా(West Godavari District)లో మళ్ళీ పెద్దపులి(Tiger) కలకలం రేపుతోంది. కొన్ని రోజులుగా కనుమరుగైన బెంగాల్ టైగర్(Bengal Tiger) తాజాగా కోరుకొండ పరిసరాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ముఖ్యంగా చారిత్రక ప్రాంతమైన పాండవుల మెట్టపై పులి సంచరిస్తున్నట్లు అటవీ శాఖ(Forest Department) అధికారులు గుర్తించారు. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పులి కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు.. అది ప్రస్తుతం ఏ దిశగా వెళ్తుందో అంచనా వేస్తున్నారు.
స్థానికులకు హెచ్చరికలు జారీ
పులి సంచారంతో కోరుకొండ(Korukonda), సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, ఒంటరిగా అడవి ప్రాంతాలకు లేదా శివారు ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. పులిని బంధించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ధైర్యంగా ఉండాలని అధికారులు సూచించారు.






