AP : చోరీకి వచ్చి.. దొంగ మృతి

by Naga Rani Yarlagadda |

చోరీకి వచ్చిన దొంగ తీవ్రగాయంతో ఆస్పత్రిపాలై మరణించిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.

AP : చోరీకి వచ్చి.. దొంగ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ కాలనీలో చోరీకి వచ్చిన దొంగ.. స్థానికులు తరమడంతో రైల్వే ట్రాక్ తగిలి తీవ్రగాయంతో మరణించాడు. ఈ ఘటన రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో వెలుగుచూసింది. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలోకి ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలు చోరీకి వచ్చారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని కాలనీవాసులు వెంటాడగా.. తప్పించుకునే క్రమంలో పరిగెడుతూ రైల్వేట్రాక్ తగిలి అతను కిందపడిపోయాడు. ఈ ఘటనలో దొంగ నారాయణస్వామి తలకు గాయం కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన బుధవారం తెల్లవారుజామున మరణించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు దొంగలకోసం పోలీసులు గాలిస్తున్నారు. చోరీకి వచ్చిన దొంగలు బళ్లారి ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు.

Next Story