- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండగ పూట వెంటాడిన విధి.. గంటలోనే ఇద్దరు అన్నదమ్ములు మృతి
బాపట్ల జిల్లా చీరాలలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: బాపట్ల జిల్లా చీరాల(Chirala)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే రోజు ఇద్దరు అన్నదమ్ములు(Brothers) మృతి చెందారు. ఈ ఘటన స్థానిక గొల్లపాలెం(Gollapalem)లో జరిగింది. గొల్లపాలేనికి చెందిన అన్నదమ్ముల్లో ఒకరైన గంగాధర్‌కు గుండెపోటు(Hart Attack) వచ్చింది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.
అన్నతో పాటే...
అయితే అన్నతో పాటు ఆస్పత్రికి తమ్ముడు గోపి కూడా వెళ్లారు. ఆస్పతికి వెళ్లే సరికి అన్న గంగాధర్ మృతి చెందారు. దీంతో అన్న గంగాధర్ మృతి వివరాలు చెబుతుండగా తమ్ముడు గోపికి కూడా గుండెపోటు వచ్చింది. వెంటనే కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించగా గోపి కూడా మృతి చెందారు. అన్నదమ్ములు ఒకే రోజు మృతి చెందడంతో చీరాల గొల్లపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చావులోనూ అన్న గంగాధర్‌ను తమ్ముడు గోపి వదిలిపెట్టలేదని స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.






