- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తీవ్ర విషాదం.. రిజర్వాయర్‌లో గల్లంతై ముగ్గురు యువకుల మృతి
కడప జిల్లా చల్లబసాయపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లా చల్లబసాయపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రిజర్వాయర్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ప్రొద్దుటూరు చెందిన యువకులు చల్లసాయపల్లె రిజర్వాయర్ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. అయితే ముగ్గురు యువకులు కూడా స్నానం చేస్తుండగా నీళ్లలో గల్లంతయ్యారు. ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు యువకులు రక్షించే ప్రయత్నం చేశారు. కానీ ఫలితంలేకుండా పోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటన స్థలంలో గజ ఈతగాళ్లతో గాలించి యువకుల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రొద్దుటూరుకు చెందిన స్నేహితులుగా గుర్తించారు. ఈ ఘటనతో మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చేతికి అందివచ్చిన కుమారులు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. వీరిని చూసిన స్థానికులు సైతం కంటతడి పెట్టుకున్నారు. దీంతో ఆస్పత్రికి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి.






