అయోధ్యలంకలో తీవ్ర విషాదం.. ముగ్గురు బాలురులు మృతి

by Vemula.Srinu Prasad |

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది...

అయోధ్యలంకలో తీవ్ర విషాదం.. ముగ్గురు బాలురులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ఆచంట మండలం అయోధ్యలంక(Ayodhya Lanka)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. స్నేహితులు ప్రవీణ్, సూర్యతేజ, పౌలు కుమార్ గోదావరి నదిలో స్నానానికి దిగారు. అయితే ఈత కొడుతుండగా ఒక్కసారిగా గల్లంతయ్యారు. కొద్దిసేపటికే నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ముగ్గురు బాలురుల మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబం కన్నీరు మున్నీరు అయింది.

Next Story