వైసీపీలో తీవ్ర విషాదం.. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-09-12 14:41:12  IST  )

రాప్తాడు వైసీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది..

వైసీపీలో తీవ్ర విషాదం.. తోపుదుర్తి భాస్కర్ రెడ్డి కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్: రాప్తాడు వైసీపీ(Ycp)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పార్టీ సీనియర్ నేత తోపుదుర్తి భాస్కర్ రెడ్డి(Topudurthi Bhaskar Reddy) హఠాన్మరణం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం పొలం పనులు చేయిస్తూ భాస్కర్ రెడ్డి ఆకస్మికంగా కళ్లు తిరిగి కింద పడిపోయారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే భాస్కర్ రెడ్డి మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా తోపుదుర్తి భాస్కర్ రెడ్డి.. తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బాబాయ్. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలోనూ పని చేశారు. భాస్కర్ రెడ్డి మృతి విషయం తెలుసుకున్న వైఎస్ జగన్(Ys Jagan) దిగ్భ్రాంతి వ్యక్తిం చేశారు. భాస్కర్ రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని జగన్ ట్వీట్ చేశారు.

Next Story