రాష్ట్రంలో హృదయ విదారక ఘటన.. బైకుపై మృతదేహంతో పదికిలోమీటర్ల ప్రయాణం

by Gantepaka Srikanth |

బైకుపై మృతదేహాన్ని పది కిలోమీటర్లు తీసుకెళ్లారు.

రాష్ట్రంలో హృదయ విదారక ఘటన.. బైకుపై మృతదేహంతో పదికిలోమీటర్ల ప్రయాణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల(Bapatla) జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో లేకపోవడంతో బైకుపైనే మృతదేహాన్ని పది కిలోమీటర్లు తీసుకెళ్లారు. ఈ ఘటన కర్లపాలెం మండలంలో చింతయపాలెం పంచాయతీ రాళ్లచెరువులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాళ్లచెరువు గ్రామానికి చెందిన నక్క నాగేశ్వరరావుకు గుండెనొప్పి వచ్చింది. వెంటనే అతని సోదరులు బైకుపై బాపట్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే నాగేశ్వరరావు మృతి చెందాడని చెప్పారు. దీంతో నాగేశ్వరరావు మృతదేహాన్ని తరలించడానికి మహాప్రస్థానం వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. వారు డబ్బులు ఎక్కువగా డిమాండ్ చేశారు. భరించలేమని భావించి.. పది కిలోమీటర్లు బైకుపైనే ప్రయాణం చేసి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. పేదలకు ఏ ఆపద వచ్చినా మేము ముందు ఉంటాం అనే స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తలు ఇలాంటి సమయంలో ఎందుకు ముందుకు రారు అని గ్రామస్తులు, కుటుంబసభ్యులు ప్రశ్నించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story