- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండిగో విమానంలో సాంకేతిక లోపం.. రన్ వేపై నిలిపివేత
by Vemula.Srinu Prasad |
విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు...

X
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఈ సమస్యను గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని రన్‌వేపైనే నిలిపివేసి అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం సాంకేతిక సిబ్బంది విమానానికి మరమ్మతులు చేస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
అయితే, ఈ హఠాత్తు పరిణామంతో విమాన ప్రయాణికులు విమానాశ్రయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణం ఆలస్యం కావడంతో పాటు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్పష్టత లేకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలతో ఉన్న వారు గంటల తరబడి వేచి ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు.
Next Story






