నా భర్తకు ప్రియుడున్నాడు.. నన్ను చంపేస్తారు: పోలీసులకు భార్య కంప్లైట్

by Vemula.Srinu Prasad |

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది..

నా భర్తకు ప్రియుడున్నాడు.. నన్ను చంపేస్తారు: పోలీసులకు భార్య కంప్లైట్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం(Sri Sathya Sai District Dharmavaram)లో విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. భర్త, భర్త ప్రియుడు తనను చంపేస్తారని భార్య ఫిర్యాదు చేయడం వైరల్ అవుతోంది. భర్త దాశరథి, భర్త ప్రియుడు మన్సూరుద్దీన్‌పై తులసి అనే మహిళ ఫిర్యాదు చేశారు. తన భర్తకు మన్సూరుద్దీన్ అనే వ్యక్తితో కొంతకాలంగా అనైతిక సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. ఇద్దరూ బెడ్‌రూమ్‌లో సన్నిహితంగా ఉండడం తాను చూశానని, ఈ విషయం బయటికి చెప్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారంటూ పోలీసులకు తెలవిపారు.

Next Story