- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘నాకు చిన్న కుర్చీ చాలు’.. కుమారస్వామి పట్ల గౌరవం చాటుకున్న లోకేశ్
పెద్దలపై తనకున్న గౌరవాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి చాటుకున్నారు. కర్ణాటకలోని సింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో నిర్వాహకులు లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఓ పెద్ద కుర్చీని ఏర్పాటు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దలపై తనకున్న గౌరవాన్ని ఏపీ మంత్రి నారా లోకేశ్ మరోసారి చాటుకున్నారు. కర్ణాటకలోని సింధనూరులో జరిగిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో నిర్వాహకులు లోకేశ్ కోసం ప్రత్యేకంగా ఓ పెద్ద కుర్చీని ఏర్పాటు చేశారు. అయితే, వేదికపై తన పక్కనే ఉన్న కేంద్ర మంత్రి కుమారస్వామి సాధారణ కుర్చీలో కూర్చోవడాన్ని గమనించిన లోకేశ్.. తాను ఆ పెద్ద కుర్చీలో కూర్చోడానికి నిరాకరించారు. వయసులో పెద్దవారైన కుమారస్వామిని ఆ కుర్చీలో ఆసీనులు కావాలని కోరారు. ఆయన సున్నితంగా తిరస్కరించడంతో లోకేశ్ సైతం మరో సాధారణ కుర్చీ తెప్పించుకుని కూర్చుని అందరి మన్ననలు పొందారు.
అనంతరం హోసళ్లీ క్యాంప్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్‌ను కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేథ్‌లతో కలిసి లోకేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైనికుల త్యాగాలు మరువలేనివని కొనియాడారు. రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విశాఖ ఉక్కును కాపాడిన కుమారస్వామి కేంద్ర ఉక్కుశాఖ మంత్రిగా ఉండటం మన అదృష్టమని, ఆయనకు ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
బాలయ్య–రమేష్ వర్మ ‘భీష్మ’: ఆగిపోవడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా?






