- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలయ్య–రమేష్ వర్మ ‘భీష్మ’: ఆగిపోవడం వెనుక ఇంత పెద్ద కథ నడిచిందా?
బాలయ్య మాస్ క్రేజ్‌ను హ్యాండిల్ చేయలేననే ఉద్దేశంతో, లాంచింగ్ అయిన తర్వాత ‘భీష్మ’ మూవీని రమేష్ వర్మ ఆపేసినట్లు తెలుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: 2009లో విడుదలైన రైడ్ చిత్రం ద్వారా దర్శకుడు రమేష్ వర్మ మంచి గుర్తింపును సంపాదించారు. ఈ సినిమా విజయంతో నిర్మాత బెల్లంకొండ సురేష్, బాలకృష్ణ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రమేష్ వర్మను కలిసి తన ఆలోచనను చెప్పగా, ఆయన కూడా బాలయ్యను దృష్టిలో పెట్టుకుని ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారట. ఈ సినిమాకు ‘భీష్మ’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేసి, సినిమా ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అయితే ఆ సమయంలో బాలకృష్ణ వరుస పరాజయాల్లో ఉండటంతో, ఈ చిత్రంతో ఎలాగైనా మంచి విజయాన్ని అందించాలనే ఒత్తిడి రమేష్ వర్మపై పెరిగిందట.
బాలయ్య అభిమానులు మరియు ఆయన సన్నిహితులు కూడా ‘భీష్మ’ సినిమాతో భారీ హిట్ ఇవ్వాలని దర్శకుడిని కోరడం ప్రారంభించారట. ఇప్పటివరకు పెద్ద స్టార్ హీరోతో పని చేసిన అనుభవం లేకపోవడం, అలాగే బాలకృష్ణ లాంటి మాస్ హీరోను సరిగ్గా హ్యాండిల్ చేయగలనా అనే అనుమానం రమేష్ వర్మకు కలిగిందట. ఈ కారణాలతో ఆయనలో భయం పెరిగి, చివరకు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో కథ పూర్తిగా సిద్ధం కాలేదనే కారణాన్ని చూపుతూ, కొంతకాలం ఈ ప్రాజెక్ట్‌ను సాగదీసి చివరకు ‘భీష్మ’ సినిమాను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత బాలకృష్ణ కోసం సిద్ధం చేసిన అదే కథను 'వీర'గా రవితేజతో తెరకెక్కించి విడుదల చేసినట్లు సమాచారం. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ‘వీర’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.






