సీఎం చంద్రబాబు పర్యటనలో షాకింగ్ ఘటన.. కాన్వాయ్‌కు అడ్డుపడిన యువకుడు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-23 12:48:36  IST  )

సీఎం చంద్రబాబు ఏలూరు జిల్లా పర్యటనలో షాకింగ్ ఘటన నమోదు అయింది...

సీఎం చంద్రబాబు పర్యటనలో షాకింగ్ ఘటన.. కాన్వాయ్‌కు అడ్డుపడిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(Ap Cm Chandrababu) ఏలూరు జిల్లా(Eluru District)లో పర్యటించారు. అయితే ఆయన పర్యటనలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు‌పై వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్‌కు ఓ యువకుడు అడ్డుపడ్డారు. తనకు న్యాయం చేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సీఎం చంద్రబాబు కారు నుంచి కిందకు దిగి యువకుడితో మాట్లాడారు. తన భూమి రికార్డులను జగన్ హయాంలో తారుమారు చేశారని చెప్పారు. దీంతో చలించిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా అధికారులతో మాట్లాడారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో బాధితుడి కళ్లల్లో ఆనందం కనిపించింది.

Next Story